Corona Virus: నేపాల్‌కు అదనపు ఆక్సిజన్‌ ట్యాంకర్లు అందించనున్న భారత్‌

India will provide oxygen to Nepal

  • నేపాల్‌లోనూ విజృంభిస్తున్న కరోనా
  • బాధితులు పెరగడంతో ఆక్సిజన్ కొరత
  • రానున్న 8-10 రోజుల్లో అదనపు ఆక్సిజన్‌కు భారత్‌ హామీ
  • సోమవారం 214 మరణాలు, 9,198 కొత్త కేసులు

నేపాల్‌లోనూ కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది. దీంతో ఆక్సిజన్‌ కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలో నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత్‌ ముందుకొచ్చింది. అదనపు లిక్విడ్‌ ఆక్సిజన్ ట్యాంకర్లను అందజేస్తామని ఆ దేశంలో ఉన్న భాతర రాయబారి వినయ్‌ మోహన్ క్వత్రా నేపాల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. రానున్న 8-10 రోజుల పాటు ఈ సాయం కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 2.3 మిలియన్ల కొవిషీల్డ్‌ టీకాలను నేపాల్‌కు అందజేసినట్లు గుర్తుచేశారు.

ఖాట్మండులో నూతనంగా ఏర్పాటు చేసిన 90 పడకల సామర్థ్యం గల ఓ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తూ నేపాల్‌కు భారత్‌ సాయాన్ని క్వత్రా ప్రకటించారు. నేపాల్‌లో సోమవారం 9,198 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే మరో 214 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు నేపాల్‌లో 4,64,218 కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఆక్సిజన్‌ కొరత యావత్తు దేశాన్ని ఆందోళనకు గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం సరిపడా ఆక్సిజన్‌ లభ్యతకు అనేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు కాస్త కొలిక్కి వచ్చాయి.

  • Loading...

More Telugu News