Raghu Rama Krishna Raju: రఘురాజును కలిసేందుకు కుటుంబసభ్యులను కూడా అనుమతించని అధికారులు!
- ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురాజు
- జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎవరూ కలవకూడదన్న అధికారులు
- ఆర్మీ ఆసుపత్రిలో రఘురాజుకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యూడీషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఆయనకు పరీక్షలను నిర్వహిస్తోంది. మరోవైపు రఘురాజును చూసేందుకు వస్తున్న ఎవరినీ ఆసుపత్రిలోకి అధికారులు అనుమతించడం లేదు. ఆయన కుటుంబసభ్యులను కూడా లోపలకు రానివ్వలేదు.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురాజు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎవరైనా కలవాలనుకుంటే... చట్ట ప్రకారం అది ములాఖత్ కిందకు వస్తుంది. అంటే... సదరు వ్యక్తిని కలవాలంటే చట్ట ప్రకారం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అధికారులు కూడా అదే చెపుతున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు కూడా కలవడానికి కుదరదని వారు స్పష్టం చేశారు.