Meera Chopra: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సినీ నటి మీరా చోప్రా
- కరోనా పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు లభించడం లేదు
- కనీస సౌకర్యాలు కూడా ప్రజలకు లేవు
- అలాంటప్పుడు ప్రజలు జీఎస్టీ ఎందుకు చెల్లించాలి?
కేంద్ర ప్రభుత్వంపై సినీ నటి మీరా చోప్రా తీవ్ర విమర్శలు గుప్పించింది. కరోనా కారణంగా కేవలం వారం రోజుల్లో ఆమె కుటుంబంలో ఇద్దరు సభ్యులు చనిపోయారు. దీంతో కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించింది. కరోనా కష్ట కాలంతో పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు లభించడం లేదని... బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ దొరకడం లేదని విమర్శించారు.
ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని... అలాంటప్పుడు ప్రజలు 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేనప్పుడు... ఈ జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా లేనప్పుడు... ప్రజలు జీఎస్టీ ఎందుకు చెల్లించాని ఆమె ప్రశ్నించారు.