Serum: భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ రెండు, మూడు నెలల్లో పూర్తయ్యే పనికాదు: సీరం

Serum opines on corona vaccination in country

  • కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం
  • భారత్ పెద్ద దేశమని వెల్లడి
  • వ్యాక్సినేషన్ కు అనేక అడ్డంకులు ఉన్నాయని వివరణ
  • దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట అని స్పష్టీకరణ

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కు సుదీర్ఘ సమయం పడుతుందని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండు, మూడు నెలల్లో పూర్తయ్యే పనికాదని స్పష్టం చేసింది. అందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, వ్యాక్సినేషన్ పై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపింది.

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరమ్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దేశ ప్రజల ప్రయోజనాలను తోసిరాజని కరోనా వ్యాక్సిన్ డోసులను విదేశాలకు ఎగుమతిచేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. జనవరి 2021 నాటికి తమ వద్ద భారీస్థాయిలో వాక్సిన్ నిల్వలు ఉన్నాయని, కానీ కోవాక్స్ కార్యాచరణలో భాగంగా కొన్ని ఒప్పందాలు ఉన్నందున వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేశామని వివరించింది.

  • Loading...

More Telugu News