Tirumala: తిరుమల కొండపై భారీగా తగ్గిన భక్తులు
- తిరుమల ఆలయంపై కరోనా ఎఫెక్ట్
- నిన్న దర్శించుకున్న భక్తుల సంఖ్య 3,485
- హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ. 22 లక్షలు
అనునిత్యం 50 వేల మందికి పైగా భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు భక్తులు లేక బోసిపోతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు ఎక్కువగా రావడం లేదు. దీనికి తోడు పలు రాష్ట్రాలు లాక్ డౌన్లు విధించడం కూడా ప్రభావం చూపుతోంది. ప్రయాణాల వల్ల కరోనా బారిన పడతామేమోననే భయం ప్రజల్లో ఉంది. నిన్న కేవలం 3,485 మంది భక్తులు మాత్రమే వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరిలో 1,379 మంది తలనీలాలు ఇచ్చారు. నిన్న హుండీ ద్వారా టీటీడీకి రూ. 22 లక్షల ఆదాయం వచ్చింది.