Komaram Bheem: రేపు కొమురం భీమ్ ఉగ్రరూపం విడుదల.... ఆర్ఆర్ఆర్ నుంచి కీలక అప్ డేట్

Komram Bheem intense look from RRR will be released tomorrow
  • ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ గా ఎన్టీఆర్
  • రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ లుక్ విడుదల 
  • రాజమౌళి దర్శకత్వంలో చిత్రం
  • ప్రధానపాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా
ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఉగ్రరూపాన్ని రేపు చూడొచ్చని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అభిమానులు కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ పిలుపునిచ్చింది. వేడుకలు జరపుకునేందుకు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న విడుదల చేయాలని చిత్రబృందం సంకల్పించినా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా నెలన్నర పాటు షూటింగ్ చేస్తేనే చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత గ్రాఫిక్స్ పనులు, డబ్బింగ్, తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపాలంటే ఎంతో సమయం పడుతుంది. దాంతో దసరా నాటికి ఈ చిత్రాన్ని తీసుకురావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Komaram Bheem
NTR
RRR
Update
Rajamouli
Ramcharan
Tollywood

More Telugu News