TDP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అసభ్యకర వీడియో కేసులో సీబీఎన్ ఆర్మీ సభ్యుల విడుదల

CBN Army members released from police
  • వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడి ఫిర్యాదుతో మంగళవారం అరెస్ట్
  • నిన్న స్టేషన్ బెయిలుపై విడుదల
  • విచారణ పేరుతో అర్ధరాత్రి వరకు వేధించారని ఆరోపణ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అసభ్యకరంగా వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారన్న అభియోగాలతో అరెస్ట్ అయిన ఇద్దరు సీబీఎన్ ఆర్మీ సభ్యులను పోలీసులు నిన్న స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. విజయసాయిపై అసభ్యకరంగా ఉన్న వీడియోను రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారంటూ వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు సీబీఎన్ ఆర్మీ సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి వెంకట మహేశ్, సాయికల్యాణ్‌లను మంగళవారం అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిలుపై నిన్న విడుదలైన అనంతరం మహేశ్ మాట్లాడుతూ.. విచారణ పేరుతో పోలీసులు తమను వేధించారని ఆరోపించారు. విడుదలైన మహేశ్, సాయి కల్యాణ్‌లకు టీడీపీ నేతలు పలువురు సంఘీభావం తెలిపారు.
TDP
CBN Army
Guntur
Arrest
YSRCP
Vijay Sai Reddy

More Telugu News