Telangana: లాక్ డౌన్ సడలింపు సమయంలో హడావిడి... సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జనం గుంపులు!
- కరోనా భయమే లేని జనం
- లాక్ డౌన్ సడలింపులు 4 గంటలే
- ఏ పని చేసుకోవాలన్నా ఉన్నది ఆ టైమే
- జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి
సరుకులు తెచ్చుకోవాలన్నా.. కూరగాయలు కొనుగోలు చేయాలన్నా.. వేరే ఎక్కడికైనా వెళ్లాలన్నా ఉదయం 6 నుంచి 10 గంటల వరకే. ఉన్నది ఆ నాలుగు గంటల సమయం. ఆ తర్వాత పోలీసులు కేసులు రాస్తున్నారు.
అయితే, ఆ తొందర్లో పడి ప్రజలు భౌతిక దూరం నిబంధనలను మరచిపోతున్నారు. కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉంటుందన్న కనీస విషయాన్ని పట్టించుకోవట్లేదు. 4 గంటల్లో పనులు పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రజలు ఎక్కువ మంది ఉంటున్నా నిత్యావసరాల కోసం వెళ్లక తప్పని పరిస్థితి.
సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో కనిపించిన పరిస్థితి ఇది. ఇదీ ఒక్క మోండా మార్కెట్ కే పరిమితం కాదు. హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే లాక్ డౌన్ సడలింపుల టైంను 12 గంటల వరకు పెంచాలంటూ సీఎం కేసీఆర్ కు జనాలు లేఖల మీద లేఖలు రాస్తున్నారు మరి. కాగా, లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగిస్తూ సర్కార్ మొన్ననే ఉత్తర్వులు ఇచ్చింది.