Southwest Monsoon: మరో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం

Forecast for southwest monsoon

  • నైరుతి రాకపై తీపి కబురు
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
  • శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం
  • తుపాను బలపడే అవకాశం

నైరుతి రుతుపవనాల రాకపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం తియ్యని కబురు అందించింది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయని వెల్లడించింది.

ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ అల్పపీడనం 24వ తేదీ నాటికి తుపానుగా మారుతుందని పేర్కొంది. ఇది వాయవ్య దిశగా పయనించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈ నెల 26న తీరాన్ని చేరుతుందని వాతావరణ కేంద్రం వివరించింది.

అటు, భారత వాతావరణ కేంద్రం కూడా నైరుతి రుతుపవనాల ఆగమనంపై సానుకూల సమాచారం వెల్లడించిన సంగతి తెలిసిందే. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈ ఏడాది అంచనాలకు అనుగుణంగానే వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News