At Home Covid Testing Kits: మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్లోకి 'ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్స్'

ICMR approves At Home Covid Testing Kits
  • ఎవరికి వారే కరోనా పరీక్షలు
  • ఐసీఎంఆర్ అనుమతి
  • ఒక్కో కిట్ ధర రూ.250
  • జూన్ నెలాఖరుకు 45 లక్షల టెస్టులు లక్ష్యం
  • నిన్న ఒక్కరోజే దేశంలో 20 లక్షల టెస్టులు
ఇక ఇంటి వద్దనే ఎవరికి వారే కరోనా టెస్టులు చేసుకునేందుకు ఉపకరించే సరికొత్త కొవిడ్ టెస్టింగ్ కిట్లు రంగప్రవేశం చేస్తున్నాయి. వీటిని ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లుగా పిలుస్తారు. ఈ ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లు మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ఈ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఒక ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్ ధర రూ.250 అని వెల్లడించారు.

ఈ నెలాఖరుకు 25 లక్షల కరోనా పరీక్షలు, జూన్ నెలాఖరుకు 45 లక్షల పరీక్షలు చేయాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 20 లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించామని బలరామ్ భార్గవ్ వెల్లడించారు.
At Home Covid Testing Kits
ICMR
India
Corona Tests

More Telugu News