Prabhas: ప్రభాస్ ప్రాజెక్టుపై నాగ్ అశ్విన్ కసరత్తు!

Nag Ashwin is trying hard for Prabhas movie script
  • దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి మంచి పేరు
  • నిర్మాతగానూ ప్రయోగాలు
  • ప్రభాస్ ప్రాజెక్టుపైనే ప్రత్యేక దృష్టి
ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కథను చేయనున్నట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ మధ్య చెప్పారు. పాన్ ఇండియా సినిమాకి సరైన అర్థం చెప్పేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని అన్నారు. దాంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి. రాధే శ్యామ్' .. 'సలార్' .. 'ఆది పురుష్' తరువాత ప్రభాస్ ఈ సినిమా చేయనున్నాడని చెప్పగానే, కాస్త ఆలస్యమైనా ప్రభాస్ నుంచి మరో అద్భుతమైన సినిమా రానున్నందుకు అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

అయితే తన ప్రాజెక్టు లేట్ అవుతున్నందుకు నాగ్ అశ్విన్ అసంతృప్తికి లోనుకావడం లేదట. స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెట్టి, ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడట. ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యాన్ని వర్క్ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక సెట్స్ పైకి వెళ్లిన తరువాత సమయం వృథా కాకుండా .. దేని గురించిన వెతుకులాట లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ఈ సమయాన్ని ప్రాజెక్టును మరింత స్పీడ్ గా పూర్తి చేయడానికి ఆయన వినియోగించుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
Prabhas
Nag Ashwin

More Telugu News