Anjani Kumar: రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నాం: హైదరాబాద్ సీపీ
- నగర ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలి
- కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు
- తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు
హైదరాబాద్ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు పోలీసులు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ రోజు దిల్‌సుఖ్‌నగర్ తనికీ కేంద్రాన్ని పరిశీలించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు.
నగర ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. తమ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్ మినహాయింపులు ఉన్నవారికే రోడ్లపై తిరగడానికి అనుమతి ఉంటుందని, తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లల్లో ఉండాలని ఆయన సూచించారు.