Lok Sabha Speaker: రఘురాజు కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ స్పందన

Lok Sabha speaker sends Raghu Raju family complaint to privilage committee

  • ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన ఓం బిర్లా
  • పూర్తి వివరాలను పంపించాలని హోంశాఖకు ఆదేశం
  • మరోవైపు రఘురాజు పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. ఓ వైపు బెయిల్ పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో రఘురాజు కుటుంబసభ్యులు తనకు ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపించారు. అంతేకాదు, పూర్తి వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు.

మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దవే వాదిస్తూ... రఘురాజుకు సంబంధించి ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికతో తాము విభేదించడం లేదని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అయితే రఘురాజుకు గాయాలు ఎలా అయ్యాయనే విషయం ఆసుపత్రి రిపోర్టులో లేదని చెప్పారు. నివేదిక అసంపూర్తిగా ఉందని తెలిపారు. కేసులో కక్షిదారుడు కాని జగన్ పేరును లాగొద్దని అన్నారు.  

  • Loading...

More Telugu News