Raghu Rama Krishna Raju: జగన్ పై రెండు డజన్లకు పైగా కేసులున్నాయి: సుప్రీంకోర్టులో రోహత్గీ

There are more than 2 dozen cases against Jagan says Mukul Rohatgi to Supreme Court

  • రఘురాజు పిటిషన్ పై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు
  • జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తన క్లయింట్ ప్రశ్నిస్తున్నారన్న రోహత్గీ
  • సీఐడీ అధికారులు, వైద్యులపై సీబీఐ విచారణకు ఆదేశించాలి

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. రఘురాజు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ... గత ఏడాది కాలంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను తన క్లయింట్ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే ఆయనపై జగన్ కక్ష కట్టారని తెలిపారు. జగన్ పై రెండు డజన్లకు పైగా కేసులున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా తప్పుడు రిపోర్టును సీఐడీ సమర్పించిందని రోహత్గీ అన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా వైద్యులు ఇచ్చిన నివేదికలో ఉందని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో కాలుకి ఫ్రాక్చర్ అయనట్టు స్పష్టంగా ఉందని చెప్పారు. తప్పుడు నివేదికకు కారణమైన పోలీసు అధికారులు, వైద్యులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. సీఐడీ ఏడీజీ స్వయంగా ఫిర్యాదును నమోదు చేశారని చెప్పారు.

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర చేస్తే రాజద్రోహం అవుతుందని... ఆయుధాలను చేతపట్టి ప్రభుత్వంపై తిరగబడాలని అంటే రాజద్రోహం అవుతుందని... రఘురాజుపై పెట్టిన రాజద్రోహం కేసు బోగస్ అని రోహత్గీ అన్నారు.

  • Loading...

More Telugu News