Varla Ramaiah: సప్త సాగరాలు ఈది పిల్ల కాలువలో పడినట్టయింది: నీలం సాహ్నీపై వర్ల రామయ్య వ్యాఖ్యలు
- ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు
- నీలం సాహ్నీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- జగన్ మాటలు విని అభాసుపాలయ్యారన్న వర్ల
- వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
ఏపీలో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నీలం సాహ్నీపైనా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. "అమ్మా నీలం సాహ్నీ గారూ... ఎంతోకాలం ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మీరు జగన్ మాటలు విని అభాసు పాలయ్యారు" అని వ్యాఖ్యానించారు. సప్త సాగరాలు ఈది, చివరకు పిల్ల కాలువలో పడినట్టయింది అని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తీరు తప్పు అని హైకోర్టు స్పష్టం చేసిందని, నీలం సాహ్నీ వెంటనే పదవికి రాజీనామా చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.