GVL Narasimha Rao: ఇది ఏపీ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం: జీవీఎల్
- కరోనా నియంత్రణకు కేంద్రం కృషి చేస్తోందన్న జీవీఎల్
- 34,040 వెంటిలేటర్లు కేటాయించినట్టు వెల్లడి
- ఏపీకి 4,960 వెంటిలేటర్లు ఇచ్చినట్టు వివరణ
- దేశం మొత్తమ్మీద 7వ వంతు అని వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పీఎం కేర్స్ నిధుల్లో భాగంగా ఏప్రిల్ 6 నాటికి రాష్ట్రాలకు 34,040 వెంటిలేటర్లను కేటాయించిందని వెల్లడించారు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 4,960 వెంటిలేటర్లు ఇవ్వడం జరిగిందని జీవీఎల్ వివరించారు. దేశం మొత్తమ్మీద 7వ వంతు కేటాయించారని, ఏపీపై కేంద్రానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ మేరకు వెంటిలేటర్ల కేటాయింపు జాబితాను కూడా జీవీఎల్ పంచుకున్నారు. ఇందులో, ఏపీ తర్వాత మహారాష్ట్రకు అత్యధికంగా 4,434, యూపీకి 4,016 వెంటిలేటర్లు కేటాయించారు.