Sonu Sood: మొదట ఏపీలో... ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తా: సోనూ సూద్

Sonu Sood says he will establish oxygen plants in other states after AP
  • కర్నూలు జీజీహెచ్ లో తొలి ప్లాంటుకు ఏర్పాటు
  • అనుమతులు ఇచ్చిన అధికారులు
  • ఆక్సిజన్ ప్లాంట్ లు ఎంతో ఉపయోగకరమన్న సూద్
  • జూన్, జులైలో ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు
ప్రముఖ నటుడు సోనూ సూద్ ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కర్నూలులో తొలి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు ఆయన నిర్ణయించుకున్నారు. కర్నూలు జీజీహెచ్ లో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. అందుకు అవసరమైన అనుమతులను అధికారులు మంజూరు చేశారు.

కొవిడ్ తో ధైర్యంగా పోరాడేందుకు ఆక్సిజన్ ప్లాంట్ లు సహాయపడతాయని భావిస్తున్నానని సోనూ సూద్ ఈ సందర్భంగా తెలిపారు. తొలుత ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం పూర్తయ్యాక, ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం చేపడతానని వివరించారు. జూన్, జులై నెలల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు.
Sonu Sood
Oxygen Plants
Andhra Pradesh
Kurnool GGH

More Telugu News