CACRC: ప్రతి ఆసియా-అమెరికన్ కు ట్రంప్ ఒక్కోడాలర్ చెల్లించాలి: సీఏసీఆర్సీ డిమాండ్

CACRC demands Trump to compensate Asia Americans

  • కరోనాను చైనా వైరస్ అని పేర్కొన్న ట్రంప్
  • ఫెడరల్ కోర్టులో దావా వేసిన సీఏసీఆర్సీ
  • ట్రంప్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారన్న కమిటీ
  • ఆసియా అమెరికన్ల మనోభావాలు దెబ్బతిన్నాయని వెల్లడి

చైనా-అమెరికా పౌరహక్కుల సంఘం (సీఏసీఆర్సీ) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై న్యూయార్క్ లోని ఫెడరల్ న్యాయస్థానంలో దావా వేసింది. కరోనా వైరస్ ను ఉద్దేశపూర్వకంగా చైనా వైరస్ అని పేర్కొన్నారని సీఏసీఆర్సీ ఆరోపించింది. ట్రంప్ తన వ్యాఖ్యలతో చైనా అమెరికన్లకు మానసిక వేదన మిగిల్చారని వెల్లడించింది. అది చైనా వైరస్ అనేందుకు ఎలాంటి అధారాలు లేకపోయినా, ట్రంప్ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చైనా వైరస్ అంటూ పదేపదే వ్యాఖ్యలు చేశారని వివరించింది.  

ట్రంప్ వ్యాఖ్యలు ఆసియా అమెరికన్ల మనోభావాలను గాయపర్చాయని పేర్కొంది. ట్రంప్ వ్యాఖ్యల దరిమిలా ఆసియా అమెరికన్లపై అమెరికాలో దాడులు పెరిగాయని సీఏసీఆర్సీ తెలిపింది. అందుకు ట్రంప్ క్షమాపణ చెబుతూ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క ఆసియా-అమెరికన్ కు ఒక్కో డాలర్ చొప్పున పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ లెక్కన 22.9 మిలియన్ డాలర్లు చెల్లంచాలని తన దావాలో స్పష్టం చేసింది. ఈ మొత్తంతో ఆసియా-అమెరికన్లు అమెరికా అభివృద్ధికి అందించిన సహకారాన్ని వెల్లడించేలా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఏసీఆర్సీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News