ICMR: ఒక్క కరోనా కేసు గుర్తిస్తే, అప్పటికి 27 మందికి కరోనా సోకినట్టే భావించాలి: ఐసీఎంఆర్
- దేశంలో ఇప్పటివరకు 24.1 శాతం మందికి కరోనా
- ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం మందికి పాజిటివ్
- 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో సెరో సర్వే
- పదేళ్లకు పైబడినవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
దేశంలో ఇప్పటివరకు 24.1 శాతం మందికి కరోనా సోకినట్టు ఐసీఎంఆర్ చేపట్టిన సెరో సర్వే వెల్లడిస్తోంది. ఐసీఎంఆర్ ఈ సర్వేను 2020 డిసెంబరు-2021 జనవరి మధ్య నిర్వహించింది. దేశంలో 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో కేసుల సరళిని పరిశీలించారు. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్ సోకినట్టేనని ఐసీఎంఆర్ పేర్కొంది.
10 ఏళ్లకు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులేనని వివరించింది. 10 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం 400 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిలు నిర్వహించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. అటు, 25.6 శాతం ఆరోగ్య సిబ్బంది కొవిడ్ బారినపడినట్టు వెల్లడైందని తెలిపింది. ఆరోగ్య సిబ్బందిలో 100 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లోనే ఎక్కువ మంది కరోనా బాధితులు ఉన్నారని వెల్లడించింది.