Telangana: ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి.. అంబులెన్సులకు ఆంక్షలు లేవు: నల్గొండ డీఐజీ రంగనాథ్

With ourt E Pass wont allow into Telangana says Nalgonda DIG

  • ఈ పాస్ లు ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
  • వైద్య చికిత్స కోసం వచ్చేవారు సంబంధిత పత్రాలను చూపించాలి
  • పాస్ లేకుండా వచ్చి ఇబ్బంది పడొద్దు

ఏపీ నుంచి వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు ఆపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డర్ లో వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ సందర్భంగా నల్గొండ డీఐజీ రంగనాథ్ మాట్లాడుతూ, ఏపీ నుంచి వస్తున్న వారికి పలు సూచనలు చేశారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ నుంచి వచ్చేవారు పోలీసుల సూచనలను పాటించాలని తెలిపారు. ఈ పాస్ లేకుండా వచ్చి సరిహద్దుల్లో ఇబ్బంది పడవద్దని సూచించారు.

అంబులెన్సులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని... అయితే కోవిడ్, ఇతర రోగులు ఆసుపత్రులు ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించాల్సి ఉంటుందని రంగనాథ్ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ నుంచి వచ్చే వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ఈ పాస్ లేనివారు అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చినట్టయితే, తగిన ఆధారాలను చూపించాలని... అప్పుడు వారిని మానవతా దృక్పథంతో అనుమతిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News