Covishield: ఏపీకి చేరుకున్న మరో 1.32 లక్షల కరోనా వ్యాక్సిన్లు

Another batch of Covishield vaccine doses arrives Gannavaram
  • రెండ్రోజుల కిందట 4.44 లక్షల డోసులు రాక
  • తాజాగా మరికొన్ని డోసులు
  • గన్నవరం స్టోరేజి కేంద్రంలో నిల్వ
  • ఆపై జిల్లాలకు తరలింపు
  • ఏపీలో వ్యాక్సినేషన్ పునఃప్రారంభం
రెండ్రోజుల కిందట ఏపీకి పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 4.44 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు పూణే నుంచి మరో 1.32 లక్షల కొవిషీల్డ్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. పూణే నుంచి గన్నవరం చేరుకున్న టీకాలను అధికారులు రాష్ట్ర స్టోరేజి కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఇతర జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.

కాగా, వారం రోజుల విరామం తర్వాత ఏపీలో వ్యాక్సినేషన్ మళ్లీ షురూ అయింది. ఈ విడతలో మూడ్రోజుల పాటు టీకాలు అందించనున్నారు. ఆర్టీసీ, బ్యాంకులు, పోర్టులు, ప్రజాపంపిణీ, పాత్రికేయ రంగాలకు చెందిన 45 ఏళ్లకు పైబడిన హైరిస్క్ వ్యక్తులకు ఈ విడతలో టీకాలు వేయనున్నారు. ఏపీలో టీకాల కొరత కారణంగా 18 నుంచి 44 ఏళ్ల లోపు వయసుల వారికి వ్యాక్సిన్ తొలి డోసు వేసేందుకు మరింత సమయం పట్టనుంది.
Covishield
Gannavaram
Pune
Andhra Pradesh
Vaccination

More Telugu News