Women Advocates: బెంగాల్ హింసపై... జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసిన 2,093 మంది మహిళా న్యాయవాదులు

Women advocates wrote CJI Justice NV Ramana seeking a committee in post Bengal elections violence

  • బెంగాల్ ఎన్నికల అనంతరం హింసపై కమిటీ వేయాలని వినతి
  • చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని వివరణ
  • లేఖ రాసిన వివిధ రాష్ట్రాల న్యాయవాదులు
  • కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మహిళా న్యాయవాదులు లేఖ రాశారు. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై 2,093 మంది మహిళా న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా న్యాయవాదులు ఉన్నారు. బెంగాల్ లో జరిగిన హింసలో చిన్నారులు, మహిళలు, ఎస్సీలపై దాడి జరిగిందని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల తదనంతర హింసపై ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని సీజేఐని కోరారు. నిర్దిష్ట కాలపరిమితితో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని విన్నవించారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News