Mehul Choksi: క్యూబాకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ?
- పీఎన్బీని రూ. 13 వేల కోట్ల మేరకు మోసం చేసిన చోక్సీ
- ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉంటున్న వైనం
- 23వ తేదీన అదృశ్యమైన చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13,000 కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచి పారిపోయి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉంటున్నాడు. అయితే, ఆయనను స్వదేశానికి రప్పించేందుకు మన అధికారులు యత్నిస్తున్నారు. చోక్సీని అప్పగించాలని భారత అధికారులు కోరుతున్నారని... ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని గౌస్టన్ బ్రౌన్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యారు. ఆయన కోసం అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా వెతుకుతోంది. ఈనెల 23 సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన తన ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లారని... ఆ తర్వాత కనపడలేదని స్థానికులు చెపుతున్నారు. అయితే ఆయన క్యూబాకు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు చోక్సీ బంధువు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో వున్న సంగతి తెలిసిందే.