Andhra Pradesh: రేపల్లె, కుప్పం, పాలకొల్లు, టెక్కలిలో ఆక్సిజన్ ప్లాంట్లు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్ణయం
- కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్
- ప్రాణవాయువు కొరతతో రోగుల మరణాలు
- హెరిటేజ్ ట్రస్ట్ సహకారంతో ప్లాంట్ల ఏర్పాటు
కరోనా రోగుల చికిత్స విషయంలో కీలకంగా మారిన ఆక్సిజన్ విషయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఆక్సిజన్ కొరత వేధిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్రంలో ఇటీవల పెద్ద ఎత్తున కరోనా రోగులు మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందుకొచ్చింది. రేపల్లె, టెక్కలి, కుప్పం, పాలకొల్లు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారం తీసుకోనున్నట్టు తెలిపింది.