Corona Virus: కరోనా వైరస్‌లోని అత్యంత కీలకమైన సి-టెర్మినల్ రీజన్ గుట్టువిప్పిన ఐఐటీ శాస్త్రవేత్తలు

IIT Mandi Study Reveals Structure Of Key Protein In Covid Virus

  • ఐఐటీ మండి శాస్త్రవేత్తల ఘనత
  • కరోనా వైరస్‌లో 16 రకాల ప్రొటీన్లు
  • శరీరంలోని కణాలను వశపరుచుకునే ‘ఎన్ఎస్‌పీ1’ ప్రొటీన్
  • కణాలను వైరస్ కేంద్రాలుగా మార్చడంలో దీనిదే ప్రధాన పాత్ర

నిజం చెప్పాలంటే ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌‌ను కట్టడి చేసే సరైన ఔషధం ఇప్పటి వరకు మానవాళికి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఐఐటీ మండి శాస్త్రవేత్తలు ఓ కీలక పరిశోధన చేపట్టి విజయం సాధించారు. నిజానికి ఏదైనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే తొలుత అందులోని ప్రొటీన్ల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌లో 16 రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకమైనది ‘ఎన్ఎస్‌పీ1’. శరీరంలోని కణాలను ఇది వశపరుచుకుని, వాటిని వైరస్ కేంద్రాలుగా మార్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది.

ఈ ప్రొటీన్‌పై దృష్టిసారించిన ఐఐటీ శాస్త్రవేత్తలు దీంట్లో కీలకమైన సి-టెర్మినల్ రీజన్ గుట్టు విప్పారు. దీనివల్ల వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రొటీన్ ఎలా ప్రవర్తిస్తుంది? దీనివల్ల వైరస్ సంక్రమణ ఏ స్థాయిలో ఉంటుంది? దీని ఆకారం ఏంటి? అన్న విషయాలు మరింత లోతుగా అర్థం చేసుకునే వీలుందని ఈ పరిశోధనలో భాగం పంచుకున్న రజనీశ్ గిరి తెలిపారు. కరోనాకు మెరుగైన చికిత్సలను రూపొందించడంలో ఈ పరిశోధన కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News