Samineni Udaya Bhanu: ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే ఉదయభానుపై ఉన్న పది కేసులూ ఎత్తివేత

Case against YSRCP Chief Whip Samineni Udaya Bhanu

  • జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో కేసుల నమోదు
  • ప్రజాప్రతినిధుల కోర్టులో వివిధ దశల్లో విచారణ
  • కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ చీఫ్ విప్, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై వివిధ దశల్లో విచారణలో ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మొత్తం కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ప్రత్యేక కోర్టులో ఉదయభాను కేసులు విచారణలో ఉన్నాయి.

డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల ఎత్తివేతకు వీలుగా ఆయా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో వివిధ అభియోగాలతో పలు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News