Nikita Kaul: భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా పుల్వామా అమరవీరుడి భార్య నిఖిత

Nikita widow of Pulwama martyr Major Doundiyal completes army training
  • 2019లో పుల్వామా ఉగ్రదాడి
  • అనేక మంది భారత జవాన్ల వీరమరణం
  • ఈ ఘటనలో మరణించిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్
  • భర్త మరణంతో సైన్యంలో చేరాలని నిఖిత నిర్ణయం
రెండేళ్ల కిందట కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అనేకమంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. నాడు మరణించిన వారిలో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ ఒకరు. అయితే, ఇప్పుడాయన అర్ధాంగి నిఖిత కౌల్ సైన్యంలో ప్రవేశించారు.

 చెన్నైలో నేడు జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆమె ఆర్మీ లెఫ్టినెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అత్యంత కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆమెకు నార్తర్న్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి లాంఛనంగా భుజాలకు స్టార్లు అమర్చి సైన్యంలోకి తీసుకున్నారు.

భర్త మరణం తర్వాత నిఖిత తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలేశారు. సైన్యంలో ప్రవేశానికి షార్ట్ సర్వీస్ కమిషన్ రాతపరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణురాలు కావడంతో, సర్వీస్ సెలెక్షన్ కమిషన్ బోర్డు ఇంటర్వ్యూలోనూ సఫలం అయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆమెకు లెఫ్టినెంట్ హోదా కల్పిస్తూ ఆర్మీ నిర్ణయం తీసుకుంది.
Nikita Kaul
Army Training
Lieutenant
Pulwama
Major Vibhuthi Shankar Doundiyal

More Telugu News