Tablets: బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం మాత్రలు రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు
- ఖరీదైన వ్యవహారంగా బ్లాక్ ఫంగస్ చికిత్స
- యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లతో చికిత్స
- యాంఫోటెరిసిన్-బి మాత్రలు అభివృద్ధి చేసిన పరిశోధకులు
- ఫార్మా భాగస్వామి కోసం అన్వేషణ
కరోనా రోగుల్లో కనిపించే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్సలో యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు వాడుతున్నారు. ఇవి చాలా ఖరీదైనవి. ఒక్కో ఇంజెక్షన్ వేలల్లో ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఐఐటీ పరిశోధకులు యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని మాత్రల రూపంలో అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్ కాకుండా నోటి ద్వారా ఆ ఔషధాన్ని తీసుకునేలా మాత్రలు రూపొందించారు.
ఈ మాత్రల తయారీ విధానాన్ని అందరితో పంచుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాత్రలను భారీ ఎత్తున ఉత్పత్తి చేయగలిగే ఫార్మా భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. మాత్రలు కావడంతో నిదానంగా తీసుకునే వీలుంటుందని, తద్వారా ఔషధాన్ని రోగి దేహం మరింత మెరుగ్గా స్వీకరిస్తుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మజుందార్, శర్మ, మృణాళిని, అనిందిత తెలిపారు.