Prashant Kishor: మోదీ సర్కారు మరో మాస్టర్ స్ట్రోక్‌ ఇది: ప్రశాంత్ కిశోర్ సెటైర్

prashant kishore slams modi

  • చాలా మంది చిన్నారులు అనాథలయ్యారు
  • వారికి ప్ర‌స్తుతం అవసరమైన సాయాన్ని అందించాలి
  • 'కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్ల‌ కృతజ్ఞత కలిగి ఉండాలి' అంటూ సెటైర్  

కేంద్ర ప్ర‌భుత్వంపై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'మోదీ సర్కారు మరో మాస్టర్ స్ట్రోక్‌ ఇది' అంటూ కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో కేంద్ర స‌ర్కారు ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు. కరోనా కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకోవడంలో కేంద్ర స‌ర్కారు ప‌నితీరు అసమర్థంగా ఉంద‌ని విమర్శించారు.

అనాథలైన చిన్నారులు తమకు ప్ర‌స్తుతం అవసరమైన సాయాన్ని అందుకోవడానికి బదులు 18 ఏళ్ల తర్వాత స్టైపెండ్‌ అందుతుందనే హామీ గురించి పాజిటివ్‌గా ఫీల్‌ అవ్వాలా? అంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. 'ఇంత గొప్ప సాయం చేస్తున్నందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్ల‌ కృతజ్ఞత కలిగి ఉండాలి' అంటూ చుర‌కంటించారు.

కాగా, క‌రోనా కార‌ణంగా అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో 577 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలా అనాథ‌లైన పిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా స్టైపండ్ ను అందిస్తామని, అంతేగాక‌, వారికి 23 ఏళ్లు వచ్చాక పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించింది. దీనిపైనే ప్రశాంత్ అలా స్పందించారు.

  • Loading...

More Telugu News