Ram: మరో రికార్డును సెట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్'

Highest record for Ismart Shankar movie
  • మాస్ మసాలా మూవీగా 'ఇస్మార్ట్ శంకర్'
  • మణిశర్మ సంగీతం హైలైట్
  • అందాలు ఆరబోసిన హీరోయిన్లు
  • 200 మిలియన్ల వ్యూస్ ను రాబట్టిన సినిమా
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామ్, తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రామ్ జోడీగా నభా నటేశ్ - నిధి అగర్వాల్ అలరించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటివరకూ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరిని, నిర్మాతగా కూడా ఈ సినిమా గట్టెక్కించింది.

అలాంటి 'ఇస్మార్ట్ శంకర్' హిందీ డబ్ వెర్షన్ కూడా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా 200 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టేసి మరో రికార్డును నమోదు చేసింది. రామ్ ఇంతవరకూ చేసిన సినిమాల్లో వ్యూస్ పరంగా 200 మిలియన్ల మార్కును అందుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. తాజాగా ఆ సినిమాల సరసన 'ఇస్మార్ట్ శంకర్' కూడా చేరింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Ram
Nabha Natesh
Nidhi Agarwal
Puri Jagannadh

More Telugu News