Tammineni Sitaram: జ్వరంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Speaker Tammineni Sitharam hospitalized again after recovered from corona
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వైనం
  • గత మూడ్రోజులుగా జ్వరం
  • మణిపాల్ ఆసుపత్రికి తరలింపు
  • స్పీకర్ ఆరోగ్యంపై ఆళ్ల నాని ఆరా
  • మెరుగైన చికిత్స అందించాలని సూచన
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లి సమీపంలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొన్నిరోజుల కిందటే స్పీకర్ తమ్మినేని, ఆయన భార్య వాణిశ్రీ కరోనా బారినపడ్డారు. తొలుత ఆయన భార్యకు, ఆ తర్వాత ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. కరోనాకు చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

కానీ, గత మూడ్రోజులుగా ఆయనకు జ్వరం వస్తుండడంతో, ఆదివారం తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మరోపక్క, స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆసుపత్రిలో చేరడంపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. సీతారాం ఆరోగ్య పరిస్థితి గురించి మణిపాల్ ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.
Tammineni Sitaram
Hospital
Corona Virus
AP Speaker
YSRCP

More Telugu News