Nagarjuna: 'మన్మథుడు 2'లో ఆ పొరపాటు జరిగిందన్న డైరెక్టర్!

Rahul Ravindran says about Manmadhudu 2 mistakes
  • నిరాశపరిచిన 'మన్మథుడు 2'
  • మోతాదు మించిన రొమాన్స్
  • అదే పొరపాటు అయిందన్న దర్శకుడు  
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. ఈ సినిమాలో నాగార్జున అంతకుముందు కంటే హ్యాండ్సమ్ గా కనిపించాడు. అప్పటి నుంచి అంతా కూడా ఆయనను సరదాగా టాలీవుడ్ మన్మథుడు అనే పిలుచుకునేవారు.

ఈ సినిమాలో రొమాన్స్ కంటే కామెడీ ఎక్కువ. అయితే ఈ సినిమాకి సీక్వెల్ అంటూ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' సినిమాను తెరకెక్కించాడు. 2019లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఆ ప్రభావం నుంచి బయటపడటానికి రాహుల్ రవీంద్రన్ కి చాలా సమయమే పట్టింది.

ఈ సినిమాలో రొమాన్స్ ను చూపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగించింది. తాజాగా అదే విషయాన్ని ఒక నెటిజన్ ప్రస్తావించగా, అందుకు రాహుల్ స్పందించాడు. రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరించేటప్పుడు తాము చాలా నవ్వుకున్నామనీ, కానీ థియేటర్లోని ప్రేక్షకులతో కలిసి చూసేటప్పుడు తాము తప్పుచేశామనే విషయం అర్థమైందని అన్నాడు. సినిమాలో ఫస్టు రొమాంటిక్ సీన్ తోనే ఆడియన్స్ అభిప్రాయాలు మారిపోయాయని చెప్పాడు. ఆ మిస్టేక్ వలన ఆ తరువాత కథను ప్రేక్షకులు పట్టించుకోలేదని అన్నాడు.
Nagarjuna
Rakul Preet Singh
Rahul Ravindran

More Telugu News