Yash: కన్నడ హీరో యశ్ దాతృత్వం... సినీ కార్మికులకు రూ.1.5 కోట్లు వితరణ
- సినీ పరిశ్రమలపై కరోనా పంజా
- కన్నడ చిత్ర పరిశ్రమ కోసం స్పందించిన యశ్
- 3 వేల మందికి ఒక్కొక్కరికి రూ.5 వేలు
- ఇది చిన్న సాయం మాత్రమేనన్న యశ్
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంలో సామాన్యుడి వెతలు అన్నీ ఇన్నీ కావు. సినీ పరిశ్రమలపైనా కరోనా పంజా విసరడంతో రోజువారీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో, కన్నడ సినీ కార్మికులను ఆదుకునేందుకు యువ హీరో యశ్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన పెద్ద మనసు ప్రదర్శిస్తూ రూ.1.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.
దాదాపు 3 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్టు యశ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే సమస్యకు ఇది పరిష్కారం అని తాను అనుకోవడంలేదని, ఇది ఒక చిరుసాయం మాత్రమేనని, భవిష్యత్ దిశగా ఆశలు కలిగించే ఓ చిన్న ప్రయత్నం మాత్రమేనని వినమ్రంగా తెలిపారు.