RBI: రూ. 500 ఫేక్ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయ్: రిజర్వ్ బ్యాంక్

Rs 500 fake currency is increasing says RBI

  • తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించిన ఆర్బీఐ
  • రూ. 500 నోట్ల ఫేక్ కరెన్సీ 31.4 శాతం పెరిగిందని వెల్లడి
  • ఇతర నోట్ల ఫేక్ కరెన్సీ తగ్గిందన్న ఆర్బీఐ

మన దేశంలో ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ఈ పరిస్థితిపై రిజర్వ్ బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన తాజా నివేదికలో ఆర్బీఐ కీలక విషయాలను వెల్లడించింది. మన వ్యవస్థలో దొంగనోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ. 500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. అయితే ఇతర డినామినేషన్ నోట్ల ఫేక్ కరెన్సీ మాత్రం తగ్గిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,453 ఫేక్ రూ. 500 నోట్లను ఆర్బీఐ గుర్తించింది.

  • Loading...

More Telugu News