Sensex: స్వల్ప నష్టాలలో ముగిసిన సెన్సెక్స్
- 85 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- ఒక్క పాయింట్ లాభపడ్డ నిఫ్టీ
- 2.83 శాతం నష్టపోయిన ఐటీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్ల వరకు పతనమయింది. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు రికవర్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 51,849 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 15,576 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.71%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.58%), బజాజ్ ఆటో (1.41%), మారుతి సుజుకి (1.32%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.83%), టెక్ మహీంద్రా (-1.20%), యాక్సిస్ బ్యాంక్ (-1.04%), ఏసియన్ పెయింట్స్ (-0.80%), భారతి ఎయిల్ టెల్ (-0.65%).