Hanuman Jayanthi: తిరుమల గిరులే హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారి అంజనాద్రిపై జయంతి వేడుకలు
- జూన్ 4న హనుమాన్ జయంతి
- 5 రోజుల పాటు జరపాలని టీటీడీ నిర్ణయం
- రోజుకో రకం పుష్పాలతో స్వామివారికి అభిషేకం, అర్చన
- కొవిడ్ నిబంధనలతో భక్తులకు అనుమతి
ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల కొండల్లోని అంజనాద్రి పర్వతమేనని టీటీడీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కిష్కంధకు చెందిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అంజనాద్రి పర్వతమే హనుమంతుడి పుట్టినిల్లు అని స్పష్టం చేస్తున్న టీటీడీ.... హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఈ నెల 4న హనుమాన్ జయంతి కాగా, అంజనాద్రి పర్వతంపై కన్నులపండువగా వేడుకలు జరపాలని నిశ్చయించింది. ఈ నెల 4వ తేదీ నుంచి 5 రోజుల పాటు రోజుకో రకం పుష్పాలతో స్వామివారికి అభిషేకాదులు జరపనున్నారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులను ఈ ఉత్సవాలకు అనుమతిస్తారు. అంజనాద్రి పర్వతమే వాయుపుత్రుడి జన్మస్థలం అని ప్రకటించిన తర్వాత ఇక్కడ చేస్తున్న తొలి జయంతి ఉత్సవాలు కావడంతో టీటీడీ వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.