vaccine: వ్యాక్సిన్ల కొర‌త తీర్చేందుకు కేంద్రం మరో నిర్ణ‌యం.. హైద‌రాబాద్‌లోని సంస్థ‌తో రూ.1,500 కోట్ల‌తో ఒప్పందం

Centre books 30 cr doses of second made in India  vaccine

  • కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన‌ బ‌యోలాజిక‌ల్-ఈ
  • ఆర్‌బీడీ ప్రొటీన్ స‌బ్‌-యూనిట్ వ్యాక్సిన్ త్వ‌ర‌లో అందుబాటులోకి
  • ఇప్ప‌టికే 1, 2 ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్  పూర్తి
  • 30 కోట్ల డోసుల ఉత్ప‌త్తికి కేంద్ర స‌ర్కారు ముంద‌స్తు చెల్లింపులు

దేశంలో వ్యాక్సిన్ల కొర‌త అధికంగా ఉన్న నేప‌థ్యంలో దాన్ని అధిగ‌మించ‌డానికి కేంద్ర స‌ర్కారు  హైద‌రాబాద్‌లోని బ‌యోలాజిక‌ల్ -ఈతో  ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్‌బీడీ ప్రొటీన్ స‌బ్‌-యూనిట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆ సంస్థ పెద్ద మొత్తంలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం కోసం కేంద్ర స‌ర్కారు ఈ ఒప్పందం చేసుకుంది.

ఇప్ప‌టికే దేశీయ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు వేస్తోన్న విష‌యం తెలిసిందే. బ‌యోలాజిక‌ల్ -ఈ అభివృద్ధి చేస్తోన్న‌ ఆర్‌బీడీ ప్రొటీన్ స‌బ్‌-యూనిట్ వ్యాక్సిన్ వినియోగంలోకి రానున్న రెండో భార‌తీయ టీకాగా నిల‌వ‌నుంది. ఒప్పందంలో భాగంగా 30 కోట్ల డోసుల ఉత్ప‌త్తికి కేంద్ర స‌ర్కారు ముంద‌స్తు చెల్లింపులు చేసింది. ఇందుకు గానూ మొత్తం రూ.1500 కోట్లు ముంద‌స్తుగా చెల్లించింది.

ఇప్ప‌టికే 1, 2 ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నివేదికను కేంద్ర ప్ర‌భుత్వానికి బ‌యోలాజిక‌ల్-ఈ  సంస్థ అంద‌జేసింది. ప్ర‌స్తుతం మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రు‌పుతోంది. కొన్ని రోజుల్లో ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

  • Loading...

More Telugu News