VVPATS: వీవీ ప్యాట్ ల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువైంది: ఈసీ

Election Commission satisfies with VVPATS usage in recent elections
  • ఎన్నికల్లో వీవీ ప్యాట్ ల వినియోగం
  • ఓటు వేయగానే రసీదు అందించే వీవీ ప్యాట్
  • 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించామన్న ఈసీ
  • ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు సరిపోలాయని వెల్లడి
ఓటు హక్కు వినియోగించుకోగానే రసీదు అందించే వీవీ ప్యాట్ యంత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్లను వినియోగించగా, వాటి పనితీరుపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. వీవీ ప్యాట్ ల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువైందని ఈసీ వెల్లడించింది.

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీగా వీవీ ప్యాట్ లను వినియోగించినట్టు తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో 1492, తమిళనాడులో 1183, అసోంలో 647, పుదుచ్చేరిలో 156, కేరళలో 728 వీవీ ప్యాట్లు వినియోగించినట్టు ఈసీ పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ ల లోని స్లిప్పులు లెక్కించగా... ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు 100 శాతం సరిపోలాయని వెల్లడించింది.
VVPATS
Election Commission
EVM
Elections

More Telugu News