Mehul Choksi: మెహుల్ చోక్సీకి బెయిలును తిరస్కరించిన డొమినికా కోర్టు
- ఇది పౌరసత్వానికి సంబంధించిన విచారణ కాదన్న డొమినికా కోర్టు
- దేశంలోకి అక్రమ ప్రవేశంపై జరుగుతున్న విచారణ అని స్పష్టీకరణ
- పై కోర్టుకు వెళ్తామన్న చోక్సీ న్యాయవాది
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు మెహుల్ చోక్సీకి బెయిలు ఇచ్చేందుకు డొమినికా కోర్టు తిరస్కరించింది. విచారణకు చోక్సీ చక్రాల కుర్చీపై కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నేడు జరుగుతున్న విచారణ చోక్సీ పౌరసత్వంపై కాదని, దేశంలోకి అక్రమ ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతోందని స్పష్టం చేసింది. చోక్సీకి మేజిస్ట్రేట్ కోర్టు బెయిలును తిరస్కరించడంతో పై కోర్టుకు వెళ్తామని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.
కాగా, పీఎన్‌బీ కుంభకోణం కేసులో రూ. 13 వేల కోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన చోక్సీ అంటిగ్వా పౌరసత్వం తీసుకుని అక్కడే ఉంటున్నాడు. ఇటీవల అక్కడి నుంచి పరారై డొమినికాలో చిక్కాడు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ లండన్‌లోని జైలులో ఉన్నాడు.