Corbevax: భారత్ లో అత్యంత చవకైన కరోనా వ్యాక్సిన్ ఇదే!

This will be India cheapest vaccine as per Biological E
  • కోర్బెవాక్స్... భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్
  • తయారుచేసిన బయోలాజికల్ ఇ
  • సింగిల్ డోస్ రూ.250
  • రెండు డోసులు రూ.400
  • అత్యవసర అనుమతుల కోసం వేచిచూస్తున్న సంస్థ
భారత్ లో త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. హైదరాబాదుకు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చవకైన వ్యాక్సిన్ కానుంది. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఇ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400కే పొందవచ్చు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వెల్లడించారు.

ఇతర సంస్థల వ్యాక్సిన్లతో పోల్చితే ఇది తక్కువ ధర అని చెప్పాలి. సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు రూ.300 కాగా, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.600 పలుకుతోంది. భారత్ బయోటెక్ తయారుచేసే కొవాగ్జిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి అందిస్తుండగా, దీని ధర ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.1,200గా ఉంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల రూ.995. వీటన్నింటితో పోల్చితే బయోలాజికల్ ఇ సంస్థ రూపొందించిన కోర్బెవాక్స్ చవకైనది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో కోర్బెవాక్స్ సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. కేంద్రం ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కోసం ముందస్తు ఆర్డర్లు బుక్ చేసింది. ఒక్కో డోసుకు రూ.50 చొప్పున రూ.1,500 కోట్ల వ్యయంతో 30 కోట్ల డోసులు సరఫరా చేయాలని బయోలాజికల్ ఇ సంస్థను కోరింది.
Corbevax
Corona Vaccine
Biological E
Hyderabad
India

More Telugu News