Supersonic: మరోసారి గగనతలంలోకి సూపర్ సోనిక్ విమానాలు!

All set for supersonic planes re entry

  • గతంలో ఔరా అనిపించిన కాంకార్డ్ విమానాలు
  • 2 వేల కిమీ మించిన వేగంతో ప్రయాణం
  • పలు కారణాలతో మూలనపడిన కాంకార్డ్
  • కొత్త సాంకేతికతతో మళ్లీ సూపర్ సోనిక్ విమానాలు
  • ఆసక్తి చూపిస్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్

ఇప్పుడున్న విమానాల్లో అత్యధిక వేగం అంటే ఎయిర్ బస్ ఏ380 గురించే చెప్పుకోవాలి. ఇది గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కానీ, దీనికంటే ముందు కాంకార్డ్ విమానం గంటకు 2,179 కిలోమీటర్ల వేగం అందుకుని సూపర్ సోనిక్ విమానాల సత్తా చాటింది. ఇది ధ్వనివేగం కంటే అత్యధిక వేగంతో ప్రయాణించినట్టు భావించాలి.

అయితే, ఈ విమానాలు ప్రమాదాలకు గురయ్యే రేటు అధికంగా ఉండడం, అధిక పౌనఃపున్యంతో కూడిన ధ్వని, ప్రయాణ ఖర్చులను ప్రజలు భరించే స్థితిలో లేకపోవడం, భారీస్థాయిలో నిర్వహణ వ్యయం కాంకార్డ్ విమానాల నిలిపివేతకు దారితీశాయి. అయితే అది గతం.

ఇప్పుడు మరోసారి సూపర్ సోనిక్ విమానాల రంగప్రవేశంపై చర్చ జరుగుతోంది. అమెరికా విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్ లైన్స్ సూపర్ సోనిక్ విమానాలపై ఆసక్తి చూపిస్తోంది. బూమ్ సూపర్ సోనిక్ అనేక స్టార్టప్ కంపెనీ తయారుచేస్తున్న ఒవెర్చర్ విమానాలను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ సిద్ధమైంది.

ఒవెర్చర్ విమానంలో అమెరికా నగరం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్ రాజధాని టోక్యో నగరానికి కేవలం 6 గంటల్లో చేరుకోవచ్చు. అదే ఇప్పుడున్న సబ్ సోనిక్ విమానాల్లో అయితే ఈ ప్రయాణానికి రెట్టింపు సమయం పడుతుంది. కాగా, బూమ్ తయారుచేసే సూపర్ సోనిక్ విమానాలు ధ్వనివేగానికి 1.7 రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. మరో ఎనిమిదేళ్లలో ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News