Venkaiah Naidu: కునారిల్లుతున్న పర్యావరణానికి ఊపిరి పోద్దాం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- సందేశం అందించిన భారత ఉపరాష్ట్రపతి
- పర్యావరణానికి మరింత పాటుపడదామని పిలుపు
- జీవన విధానాలను మార్చుకుందామని సూచన
ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా సందేశం అందించారు. క్షీణ దశకు చేరుకుంటున్న మన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు చేపడుతున్న రక్షణ చర్యలను మరింత తీవ్రతరం చేద్దామని పిలుపునిచ్చారు. మన సాగు భూముల్లో సుస్థిర వ్యవసాయ విధానాలకు మారడం ద్వారా మన అడవులను పునర్నిర్మించుకుందాం, మన సముద్రాల కాలుష్యాన్ని నివారిద్దాం అని సూచించారు.
"మనం పర్యావరణానికి హాని చేయని జీవన విధానాలను అలవర్చుకుందాం. విద్యుచ్ఛక్తి వినియోగంపై స్పృహతో వ్యవహరిద్దాం. విడుదల చేసే కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గిద్దాం. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆవాసయోగ్యమైన భూమండలాన్ని అందిద్దాం" అని వెంకయ్యనాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.