COVID19: వ్యాక్సినేషన్ లో అమెరికాను దాటేసిన భారత్
- ఎక్కువ మందికి తొలి డోసు వేసిన దేశంగా ముందుకు
- 17.2 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశామన్న కేంద్రం
- మరింత మందికి వేయాలంటే టైం పడుతుందని వెల్లడి
వ్యాక్సినేషన్ లో అమెరికాను భారత్ దాటేసింది. అయితే, మొత్తంగా కాదు. ఫస్ట్ డోస్ తీసుకున్న వారి విషయంలో మన దేశం ఈ ఘనత సాధించింది. ఎక్కువ మందికి మొదటి డోసు వేసిన దేశంగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు.
ఇప్పటిదాకా 17.2 కోట్ల మంది కరోనా టీకా ఫస్ట్ డోసు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో అమెరికాను దాటామన్నారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టింది కదా అని.. జనవరి, ఫిబ్రవరిల్లో చూపించిన నిర్లక్ష్యాన్నే ఇప్పుడూ ప్రదర్శిస్తే మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుందని హెచ్చరించారు.