gst: వరుసగా ఎనిమిదో నెల రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

GST Collection In May Above rs 1 Lakh Crore

  • మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు
  • సీజీఎస్టీ రూ.17,592 కోట్లు
  • ఎస్‌జీఎస్టీ రూ.22,653 కోట్లు
  • ఐజీఎస్టీ రూపంలో రూ.53,199 కోట్లు
  • ఏప్రిల్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గిన వసూళ్లు

మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లుగా నమోదయ్యాయి. రూ.లక్ష కోట్లకు పైగా వసూలు కావడం ఇది వరుసగా ఎనిమిదో నెల కావడం విశేషం. అయితే, ఏప్రిల్‌తో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇక గత ఏడాది మే నెలతో పోలిస్తే మాత్రం వసూళ్లలో 65 శాతం వృద్ధి నమోదైంది.

మే నెలలో వసూలైన జీఎస్టీ మొత్తంలో సీజీఎస్టీ రూ.17,592 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ.22,653 కోట్లు. ఇక ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూపంలో రూ.53,199 కోట్లు వసూలయ్యాయి. దీంట్లో రూ.15,014 కోట్లు సీజీఎస్టీకి, రూ.11,653 కోట్లు ఎస్‌జీఎస్టీకి కేంద్రం కేటాయించింది. సెస్సుల రూపంలో మరో రూ.9,265 కోట్ల ఆదాయం లభించింది.

 కరోనా కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగా ఉండడం విశేషం. ఏప్రిల్‌ నెలలో రూ.1.41 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూలు కావడం అదే మొదటిసారి.

  • Loading...

More Telugu News