Mehul Choksi: నా భర్త విషయంలో జోక్యం చేసుకోరూ.. బ్రిటన్ రాణికి చోక్సీ భార్య విన్నపం!

Priti Choksi to write Britain Queen about her Husband Mehul Choksi

  • డొమినికా పోలీసుల నిర్బంధంలో చోక్సీ
  • బ్రిటన్ రాణికి లేఖ రాయనున్న ప్రీతి చోక్సీ
  • తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణ

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికా పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. చోక్సీ భార్య తెరపైకి వచ్చింది. తన భర్తను తిరిగి సురక్షితంగా అంటిగ్వాకు చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ బ్రిటన్ రాణిని అర్థించేందుకు ప్రీతి చోక్సీ సిద్ధమవుతున్నారు.

అంటిగ్వా-బార్బుడా అధినేతగా తన భర్తకు న్యాయం చేయాల్సిందిగా బ్రిటన్ రాణికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు ప్రీతి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదులు కూడా రాణికి అర్జీ పెట్టుకుంటామని పేర్కొన్నారు. అలాగే, తన భర్త విషయంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ విషయాన్ని కూడా రాణి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

పీఎన్‌బీ కుంభకోణం వెలుగు చూడడానికి ముందే భారత్ నుంచి పరారైన మెహుల్ చోక్సీ అంట్విగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. చివరికి అతడు డొమినికాలో ఇంటర్‌పోల్‌కు చిక్కాడు. ప్రస్తుతం అక్కడి జైలులో ఉన్న చోక్సీకి బెయిలు ఇచ్చేందుకు డొమినికా కోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News