D.Raja: కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే.. కార్పొరేట్ ఆస్తులెలా పెరిగాయి?: సీపీఐ నేత డి.రాజా
- నిన్న చండ్ర రాజేశ్వరరావు జయంతి
- వెబినార్ ద్వారా మాట్లాడిన సీపీఐ అగ్రనేత
- పేదలను కేంద్రం పక్కన పెట్టేసిందని ఆగ్రహం
కరోనా వైరస్ ఉద్ధృతితో దేశంలో అర్థిక వ్యవస్థలు కుప్పకూలిన వేళ కార్పొరేట్ ఆస్తులు, ఆదాయాలు ఎలా పెరిగాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ప్యాకేజీలు ఇస్తున్న ప్రభుత్వం పేదలకు రేషన్, నగదు ఇవ్వాలనే విషయాన్ని మాత్రం పక్కనపెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని నిన్న సాయంత్రం వెబినార్ ద్వారా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న చర్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు.