COVID19: 20 కరోనా వేరియంట్లను నిర్వీర్యం చేసే సరికొత్త హైబ్రిడ్​ ప్రతిరక్షకాలు!

Nasal Spray with Hybrid Antibodies effective against 20 Covid Variants

  • మహమ్మారికి కొత్త రకం మందు
  • అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
  • ఎలుకల్లో సత్ఫలితాలనిచ్చిన నాజల్ స్ప్రే

కరోనా మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ఇప్పటిదాకా ఎన్నో వ్యాక్సిన్లు వచ్చాయి. చికిత్సకు వాడే పలు మందులూ ఉన్నాయి. అయితే, తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ కొత్త మందును అభివృద్ధి చేశారు. మన రక్తంలో ఉండే రెండు యాంటీ బాడీలను కలిపి ‘హైబ్రిడ్’ యాంటీబాడీలను సృష్టించారు. దానితో కరోనాను అంతమొందించొచ్చని చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ కు చెందిన ఝిఖియాంగ్ కూ అనే శాస్త్రవేత్త నేతృత్వాన ఐజీఎం అనే ప్రతిరక్షకానికి మరో రకం ప్రతిరక్షకం ఐజీజీలోని ముక్కలను కలిపి ఓ హైబ్రిడ్ ప్రతిరక్షకాన్ని తయారు చేశారు. దాంతో ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేను తయారు చేశారు. ఆ స్ప్రేను ఎలుకకు ఇన్ ఫెక్షన్ వచ్చే ఆరుగంటల ముందు, ఇన్ ఫెక్షన్ వచ్చిన ఆరుగంటల తర్వాత ఇచ్చి పరీక్షించారు.

రెండ్రోజులకే ఎలుకల్లో కరోనా పూర్తిగా తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 20 కరోనా వేరియంట్లపై పనిచేసినట్టు నిర్ధారించారు. కరోనా చికిత్సలో ఇది సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News