Andhra Pradesh: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సిద్ధం.. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు కరోనా టీకా!

AP to give vaccine Mothers who have 5 year old children

  • కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే
  • పిల్లలు ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తే సాయంగా ఉండాల్సింది తల్లులే
  • వారికి తొలుత టీకా ఇవ్వాలని నిర్ణయం
  • 20 లక్షల మంది తల్లులకు వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మూడో దశ కనుక వస్తే ఎదుర్కొనే ఉద్దేశంతోనే ముందస్తుగా అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. అయితే, పిల్లల తల్లులకు టీకా వేసే విషయంలో మినహాయింపు ఇస్తున్నట్టు సింఘాల్ తెలిపారు.

కరోనా వైరస్ మూడో దశ కనుక తీవ్రంగా ఉండి ఆసుపత్రులలో చేరాల్సి వస్తే పిల్లలకు సాయంగా ఉండాల్సింది తల్లులేనని, కాబట్టి వారికి తొలుత టీకా ఇవ్వాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసిందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల మంది పిల్లల తల్లులకు టీకాలు వేస్తామని, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతామని సింఘాల్ వివరించారు.

  • Loading...

More Telugu News