Parliament Monsoon Session: షెడ్యూల్ ప్రకారమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

Parliament monsoon session will be start in July as per schedule

  • జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ఆటంకాలు ఉండబోవని పార్లమెంటు వర్గాల ధీమా
  • టీకాలు తీసుకున్న ఎంపీలు, ఇతర సిబ్బంది  

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. జులైలోనే పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ విధివిధానాలపై చర్చిస్తున్నట్టు కేంద్రం వర్గాలు తెలిపాయి.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరులో జరిగాయి. కరోనాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల కాలాన్ని మూడుసార్లు తగ్గించింది. కాగా, ఈసారి వర్షాకాల సమావేశాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని, ఎందుకంటే, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర సిబ్బంది కనీసం ఒక కరోనా వ్యాక్సిన్ డోసైనా తీసుకున్నారని పార్లమెంటు అధికార వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News