Corona Virus: కొవిన్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లోని తప్పులను సరిచేసుకునే అవకాశం!
- మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్ అప్‌డేట్
- పేరు, పుట్టినతేదీ, లింగం వివరాలు తప్పుగా పడితే మార్చుకోవచ్చు
- ధ్రువపత్రాన్ని ఒకేసారి ఎడిట్ చేసుకునే అవకాశం
కరోనా టీకా ధ్రువపత్రంలో తప్పులు వస్తే కొవిన్ పోర్టల్ ద్వారా వాటిని సరిచేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసినట్లు ప్రకటించింది.
ఆ సర్టిఫికెట్‌లో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు తప్పుగా పడితే కొవిన్ పోర్టల్ తెరిచి మొబైల్ నంబరును నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కొవిన్‌లో యూజర్ల ఖాతా ఓపెన్ అవుతుందని వివరించింది.
ఆ తర్వాత అకౌంట్ డీటైల్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, రైజ్ యాన్ ఇష్యూ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం కరెక్షన్ ఇన్ సర్టిఫికెట్ ఆప్షన్ కనిపిస్తుందని తెలిపింది. దాన్ని క్లిక్ చేస్తే పేరు, పుట్టినతేదీ, లింగంలో మార్పులు చేసుకోవచ్చని వివరించింది. ఈ ధ్రువపత్రాన్ని ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.